నా పెదాలని జుర్రేసుకో.. హీరోయిన్ ఓపెన్ ఆఫర్ !

హీరోయిన్ రాశీఖన్నా చాలా ముదురు. మనసులో అస్సలు కోరికలు దాచుకోదు. వాటిని పరోక్షంగానైనా బయటపెడుతోంది. టాలీవుడ్ సన్సేషన్ విజయ్ దేవరకొండ విషయంలోనూ రాశీకి ఓ కోరిక ఉంది. ఆ కోరికని చాలా తెలివిగా బయటపెట్టింది. విశాల్ హీరోగా ‘టెంపర్’ తమిళ్ రిమేక్ ‘అయోగ్య’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో విశాల్ కి జంటగా రాశీఖన్నా నటించింది. ఈ నెల10న ‘అయోగ్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ తమిళ్ ఛానెల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది రాశీ.

ఇందులో ‘మీరు హీరో విజయ్ దేవరకొండ అయితే ఏ హీరోయిన్ కు ముద్దు పెట్టాలని కోరుకొంటారు’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాశీ చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ‘తను తరువాత సినిమాలో నటించే హీరోయిన్ కు ముద్దు పెట్టాలని కోరుకొంటా’ అంది. విజయ్ తర్వాతి సినిమా క్రాంతి మాధవన్ దర్శకత్వంలో ఉంది. ఇందులో రాశీఖన్నానే హీరోయి. ఇలా.. విజయ్ తో లిప్ లాక్ కోరికని బయటపెట్టేసింది. నా పెదాలని జుర్రుకోమని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది రాశీ. ఇక విజయ్ ఊరుకుంటాడా.. !

‘గీత గోవిందం’లో విజయ్-రస్మికల లిప్ లాక్ సినిమాకే హైలైట్ అయింది. అసలు ఆ లిప్ లాక్ చుట్టూనే కథ నడిచింది. ఇక, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి పెదాలని జుర్రేసుకొన్నారు విజయ్-రస్మిక. ఆ లిప్ లాక్ ని ట్రైలర్ లోనే చూపించి సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలని పెంచేశారు. విజయ్ నెక్ట్స్ లిప్ లాక్ రాశీతోనే అన్నమాట. కాకపోతే.. దర్శకుడు కాంత్రి మాధవన్ చాలా డిసెంట్. హీరోయిన్ స్వయంగా లిప్ లాక్ అడిగితే.. ఆయన మాత్రమే ఏం చేస్తాడు. ఓ లిప్ లాక్ ప్లాన్ చేయడం తప్ప!