విష్ణు ఇంత నీచుడా.. ?


డైలాగ్ కింగ్ మోహన్ బాబు క్రమశిక్షణకి మారుపేరు. ముక్కుసూటి మనిషి. ఆయన ప్రవర్తనతో ఎప్పుడు వివాదం కొని తెచ్చుకోలేదు. ఆయన తనయులు విష్ణు, మనోజ్ లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ‘ఓటర్’ దర్శకుడు కార్తీక్ రెడ్డి మంచు విష్ణులోని మరో కోణాన్ని బయటపెట్టారు. తనని విష్ణు హింసించాడు. బెదిరించాడు. బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్స్ పై సంతకం చేయించుకొన్నాడని ఆరోపించారు. ఈ మేరకు తెలుగు సినిమా దర్శకుల సంఘానికి సుదీర్ఘమైన లేఖ రాశాడు.

ఇందులో దాసరి కథ ‘సూరీడు’ నుంచి ప్రస్తావించారు. సూరీడు కథని విష్ణు హీరోగా ‘సేనాపతి’గా తీసుకొద్దామని ప్రయత్నించాం. మంచు ఫ్యామిలీ జోక్యం ఎక్కవడంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నా. ఆ తర్వాత ‘ఓటర్’ కథని రెడీ చేసుకొని.. విష్ణుని, నిర్మాతని సింగిల్ సిటింగ్ లో ఒప్పించాను. ఐతే, ఈ సినిమా కథని మార్చాలంటూ విష్ణు ఒత్తిడి తెచ్చాడు. ఇండస్ట్రీ సీనియర్ రైటర్స్ ని రంగంలోకి దింపాడు. ఫైనల్ గా ఓ రెండు సీన్లని మార్చాల్సి వచ్చింది. చివరికి బెదిరించి స్క్రీన్ ప్లే క్రిడిట్ తీసుకొన్నారు.

అంతేకాదు.. పలుమార్లు మోహన్ బాబుకి చెప్పినా ఫలితం లేకపోయింది. తనకు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డిలను ప్రాణ హానీ ఉందని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్స్‌కు లేఖ రాశారు కార్తీక్ రెడ్డి. ఈ వ్యవహారంపై
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఓటరు దర్శకుడు.