ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మళ్లీ షురు

భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదనను అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరమీదికి తెచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి సన్నాహాలను ఆయన పునఃప్రారంభించారు. ఐతే, లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఆయన కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పర్యటించనున్నారు.

ఈ సాయంత్రం సీఎం కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 6 గంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమవుతారు. ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చిస్తారు. అనంతరం తమిళనాడులోని రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు. ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత కర్ణాటక వెళ్తారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న రానున్నాయి. అప్పటి వరకు ఫ్రెడరల్ ఫ్రంట్ కి ఓ రూపు తీసుకురావాలనే ప్లాన్ లో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.