విమానంలో అగ్నిప్రమాదం

రష్యా రాజధాని మాస్కోలో ఎరోఫ్లాట్‌ విమానయాన సంస్థకు చెందిన విమానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందగా.. మరో 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. విమానం వెనకభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మాస్కోలోని షెరెమెత్యోవో విమానాశ్రయంలో అత్యవసరంగా దించివేశారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 78 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో విమానం వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది.