వైరల్ : గ్రౌండ్’లో రోహిత్ జోల పాట

ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చిత్తుగా ఓడింది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కి చేరింది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా కన్నా మెరుగైన రన్‌రేట్‌ సాధించిన సన్‌రైజర్స్‌ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌కు చేరింది. మొదటి బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కోల్‌కతా నిర్దేశించిన 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఒక వికెట్‌ కోల్పోయి 23 బంతులు మిగులుండగానే ఛేదించింది.

ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(30; 23 బంతుల్లో 1×4, 3×6), రోహిత్‌శర్మ(55; 48 బంతుల్లో 8×4) తొలి వికెట్‌కు 46 జోడించాక డికాక్‌ ఔటయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(46; 27 బంతుల్లో 5×4,2×6), కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

ఇక, మ్యాచ్ లో అర్థశతకం చేసిన తర్వాత రోహిత్ జోల పాట పాడటం ఆకట్టుకొంది. బ్యాట్ ని బేబిగా భావించి.. జోల కొట్టి ఆకట్టుకొన్నాడు రోహిత్. దానికి సంబంధించిన వీడియోని ఐపీఎల్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.