కాంగ్రెస్ కూటమిలోకి కేసీఆర్, జగన్.. !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సమాఖ్య కూటమి (ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కూటమిలోనే వైకాపా జగన్ కూడా ఉన్నారు. ఐతే, కేసీఆర్, జగన్ ప్రధాని నరేంద్రమోడీ తొత్తులనే ప్రచారం కూడా ఉంది. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు ఫెయిల్ అయితే.. కేసీఆర్, జగన్.. ఇద్దరు ఎన్డీయే కూటమికి ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా మద్దతిచ్చే ఆస్కారం ఉంది.

ఐతే, ఇందుకు భిన్నంగా కేసీఆర్, జగన్ లు యూపీఏలో చేరే అవకాశాలున్నాయని సంచనల వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంగళవారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 20 నుంచి 25 జడ్పీటీసీ సీట్లు కాంగ్రెస్‌ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇక ఇప్పట్లో పీసీసీ మార్పు ఉండదు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తనకొద్దని తప్పుకుంటే తప్ప మార్పు ఉండదు. ఉత్తమ్‌ తప్పుకుంటే రేవంత్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి సోదరులు, పొన్నం లాంటి బలమైన నాయకులున్నారని జగన్ అన్నారు.