‘మహర్షి’ ఫస్ట్ రివ్యూ

‘మహర్షి’ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ రాకతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో విజయంపై చిత్రబృందం చూపిన ధీమా అంచనాలని ఆకాశాన్నంటేలా చేశాయి. అభిమాను ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకొన్న వాటిని అందుకొనే సినిమా మహర్షి. అద్భుతమైన సినిమా. మహేష్ అభిమానులు కాలరెగిరేసే సినిమా అని చెప్పారు ఇప్పుడది అక్షరాల నిజమైంది. మహర్షి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఎఈలో సెన్సార్ కాపీ చూసిన అనంతరం ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.

‘వంశీ ఎంచుకొన్న సబ్జెక్ట్ అద్భుతంగా ఉంది. అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉనాయి. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు.. కాలేజీ కుర్రాడు, కంపెనీ సీఈఓ, రైతుగా విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. నటన పరంగా, లుక్ పరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా మహేష్ బాబు పెర్పార్మెన్స్ ఉంది. మహేష్ వన్ మేన్ షో చేశారని రాసుకొచ్చారు. అంతేకాదు.. మహర్షి రేటింగ్ 4/5 ఇచ్చారు. దీంతో మహర్షి మెగా బ్లాక్ బస్టర్ హిట్ అని తేలిపోయిందని చెప్పవచ్చు. ఇక, మిగిలింది రికార్డులు, కలెక్షన్స్ ని లెక్కలేసుకోవాల్సిందే.

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. సినిమాలో మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటించారు. దాదాపు రూ. 90కోట్ల బడ్జెట్ తో మహర్షి తెరకెక్కింది. ఏకంగా రూ. 140కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు నిర్మించారు.