ఓట్ల లెక్కింపుపై ప్రతిపక్షాల డిమాండ్స్.. ఇవే !
ఈవీఎంల పనితీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడాతో 21 విపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లని సీఈసీ ముందు ఉంచారు. ఆ డిమాండ్స్ ఏంటంటే…
* 5 వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాక ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారని ఈసీఐని ప్రశ్నించారు.
* ఓట్ల లెక్కింపు సమంలో ఈవీఎంలతో సమాంతరంగా వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలి
* ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు సరిపోవాలి. లేనియెడల అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించాలి
* అభ్యర్థులు కోరినచోట మళ్లీ లెక్కించాలి
* ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.