ఈ యేడాదిలోనే పవన్ సినిమా !

మే23 – జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా కీలకమైన రోజు. ఆ రోజుతో పవన్ భవితవ్యం తేలనుంది. ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారా.. ? లేదంటే యూటర్న్ తీసుకొని మళ్లీ మొహాని మేకప్ వేసుకొని సినిమాలు చేయబోతున్నాడా.. ?? అన్నది తేలనుంది. రాజకీయాలు, సినిమాలు రెండింటినీ పవన్ కొనసాగించే ఛాన్స్ కూడా ఉంది.

ఇందులో క్లారిటీ రావాలంటే మే23 వరకు ఆగాల్సిందే. మరోవైపు, పవన్ కళ్యాణ్ ఓ సినిమాకు ఓకే చెప్పాడనే ప్రచారం జరుగుతోంది. కేవలం 40రోజుల్లో పూర్తయ్యే ఓ స్క్రిప్ట్ పవన్ దగ్గరికి రావడం, దాన్ని పవన్ ఓకే చేయడం జరిగిందన్నది టాక్. ఈ చిత్ర దర్శకుడిగా హరీష్ శంకర్, త్రివిక్రమ్ పేర్లు కూడా వినిపిస్తునాయి. ఐతే, పవన్ తో సినిమాపై ఇప్పటికే హరీష్ క్లారిటీ ఇచ్చారు. అందులో నిజం లేదని తేల్చేశారు. ఇక మిగిలింది త్రివిక్రమ్. డాలీ పేరు కూడా పవన్ సినిమా కోసం వినిపిస్తోంది. ఐతే, అది హీరోగా కాదు. నిర్మాతగా.

పవన్ సొంత బ్యానర్ లో మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు సినిమా ఉండనుంది. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తారని చెప్పుకొంటున్నారు. మెగా హీరోల్లో పవన్ కు తేజు ప్రత్యేకం. ఆయన లెటెస్ట్ చిత్రం చిత్రలహరిని పవన్ చూశాడు. తేజుని మెచ్చుకొన్నాడు. తనకి ఖుషి మాదిరిగా తేజుకి చిత్రలహరి నిలుస్తుందని అన్నారట. ఈ నేపథ్యంలోనే తేజు మరో హిట్ ఇచ్చేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగాడు. తేజు సినిమాకి నిర్మాతగా మారబోతున్నాడని టాక్. మొత్తానికి ఈ యేడాదిలోనే పవన్ హీరోగా లేదంటే నిర్మాతగానైనా సినిమా రావొచ్చు. అదే జరిగితే పవన్ అభిమానులకి పండగే.. మరీ..!