క్వాలిఫయర్‌-1 : ముంబై టార్గెట్132


క్వాలిఫయర్‌-1లో ముంబై ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫా డు ప్లెసిస్‌ (6) రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో ఔటవ్వగా తర్వాత సురేశ్‌రైనా(5) జయంత్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అతడి చేతికే చిక్కాడు. దీంతో ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు మాత్రమే చేసింది. షేన్‌వాట్సన్‌(10) కూడా త్వరగానే అవుటయ్యారు.

అంబటి రాయుడు (42; 37 బంతుల్లో 3×4, 1×6), ఎంఎస్‌ ధోనీ (37; 99 బంతుల్లో 3×6) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. ఆఖర్లో బ్యాట్ రులిపించడానికి ట్రై చేసిన పిచ్.. మందకొడిగా ఉండటంతో.. ఎక్కువ పరుగులు సాధించలేకపోయారు. ఈ పిచ్ పై 132 పరుగులు చేధించడం కూడా కష్టసాధ్యమేనని అంటున్నారు. మరీ.. ముంబై ఏం చేస్తుందన్నది చూడాలి.