క్వాలిఫయర్-1 : 18 ఓవర్లకు చెన్నై 107/4
ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ స్లో గా మొదలైంది. పెద్దగా మెరుపుల్లేకుండానే సాగుతోంది. 18 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అంబటి రాయుడు (40; 34 బంతుల్లో 3×4, 1×6), ఎంఎస్ ధోనీ (18; 19 బంతుల్లో) క్రీజులోకి వచ్చాడు. కాస్త దూకుడుగా ఆడుతున్న మురళీ విజయ్ (26; 26 బంతుల్లో 3×4) రాహుల్‌చాహర్ వేసిన 12.1వ బంతికి స్టంపౌట్ అయ్యాడు. పిచ్ మందకొడిగా ఉండటం, స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంది.ఈ పిచ్ పై 120, 130 పరుగులని చేధించడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్-1 రసవత్తరంగా ముగియనుంది.