‘అవతార్2’ రిలీజ్ డేటు వచ్చేసింది

విజువల్ వండర్ ‘అవతార్’ మూడు సీక్వెల్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. రెండో సీక్వెల్ 2020లో విడుదల కావాల్సివుంది. ఐతే, సాంకేతిక కారణాల వలన అది 2021కి వాయిదాపడింది. 2021డిసెంబర్ 17న ‘అవతార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో రెండేళ్ల తర్వాత అవతార్3, అవతార్4లని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అవతార్ చిత్రానికి జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. 2009లో ‘అవతార్’ విడుదలైంది.అద్భుత విజయం సొంతం చేసుకొంది. సీక్వెల్స్ ని కూడా ఆ రేంజ్ లో రెడీ చేస్తున్నారు కామెరూన్. పండోరా గ్రహంలోని వింత జీవులు మనుగడ కోసం మానవులతో చేసే పోరాటం ఆధారంగా అవతార్ తెరకెక్కింది. ‘అవతార్ 2’ నేపథ్యం ఏంటన్నది తెలియాల్సి ఉంది.