చైతూతో సామ్ 3000సార్లు


ఇదేమీ సినిమా టైటిల్ కాదు. సమంత షేర్ చేసిన ఫోటో క్యాప్షన్. ప్రస్తుతం చై-సామ్ స్పెయిన్ లో విహరిస్తున్నారు. అక్కడ సంతోషంగా గడుపుతున్నారు. ఈ హ్యాపీ మూడులో భర్తతో కలిసి రిలాక్స్ గా దిగిన ఓ పోటోని సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. దానిపై ‘ఐ లవ్‌ యు 3000’ రాసి ఉంది. ఇన్నీ సార్లు ప్రియుడు, భర్తకు సామ్ ఐ లవ్ యూ చెప్పి ఉంటుందేమో.

పెళ్లి తర్వాత చై-సామ్ కలిసి నటించిన మజిలీ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతూ వెంకీ మామ సినిమాలో నటిస్తున్నారు. సమంత ఓ బేబీ సినిమాలో నటిస్తున్నారు. విహార యాత్రని ముగించుకొని వచ్చిన వెంటనే వీరిద్దరు షూటింగ్ తో బిజీకానున్నారు. ఇక, చై-సామ్ నుంచి ఓ గుడ్ న్యూస్ వినాలని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే.. చై-సామ్ అమ్మ-నాన్న ఎప్పుడు అవుతారని. అదే జరిగితే సామ్ సినిమాలకి దూరమవ్వడం ఖాయం.