10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ : 83/1


163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సులభంగా చేధించేలా కనిపిస్తోంది. 10ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ 83/1తో ఆటని కొనసాగిస్తోంది. ఓపెనర్ పృధ్వీ షా 54 (35బంతుల్లో 6×4, 2×6 ) దాటిగా ఆడుతున్నాడు. ఆయనకి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8 (9బంతుల్లో 1×4) క్రీజులో ఉన్నారు. మరో 10ఓవర్లలో ఢిల్లీ జట్టు 73 పరుగులు చేస్తే సరిపోతుంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు గెలిచే అవకాశాలు మెండిగా కనిపిస్తున్నాయి. ఏదైనా సంచలనం జరిగితే తప్ప సన్ రైజర్స్ గెలిచే పరిస్థితి కనబడటం లేదు.

అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గప్తిల్‌ (38; 19 బంతుల్లో, 1×4, 4×6), మనీశ్‌ పాండే (30; 36 బంతుల్లో, 3×4), కెప్టెన్‌ విలియమ్సన్‌ (28; 27 బంతుల్లో 2×4), విజయ్‌శంకర్‌ (25; 11 బంతుల్లో 2×4, 2×6), మహ్మద్‌ నబీ (20; 13 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. దిల్లీలో జట్టులో కీమో పాల్‌ 3, ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీశారు. అమిత్‌ మిశ్రాకు ఒక వికెట్‌ దక్కింది.