‘మహర్షి’లో సప్రైజ్.. అదిరిపోయింది !

‘మహర్షి’లో మొత్తం ఎనిమిది పాటలు. ఐతే, ఏడు పాటలతో మహర్షి ఆల్భమ్ ని విడుదల చేశారు. మరో పాట సప్రైజ్. అది సినిమాలో చూడబోతున్నారని మహర్షి ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సప్రైజ్ రివీల్ అయింది. పాట ఒక్కటే సప్రైజ్ కాదు. అందులో మహేష్ గెటప్ ఇంకా బిగ్ సప్రైజ్. ఈ పాటలో మహేష్ ఆయన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో కనిపించారు. అల్లరి నరేష్, మహేష్.. కృష్ణ పాటకు చిందేశారు. అభిమానులకి డబుల్ సప్రైజ్ ఇచ్చారు.

మొదటి ఆటతోనే మహర్షి మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొంది. ఫస్టాఫ్ లో మహేష్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించే ఏపీసోడ్ హైలైట్ గా నిలిచింది. సరదా సన్నివేశాలు, ఎమోషన్స్ టచింగ్ తో ఫస్టాఫ్ అదిరిపోయే లేదు. మహేష్ ఎనర్జి, టైమింగ్, లుక్స్ సూపర్భ్. సెకాంఢాఫ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. బిజినేస్ మేన్, రైతు పాత్రల్లో మహేష్ సెకాంఢాఫ్ లో దున్నేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మహర్షి మెగా బ్లాక్ బస్టర్ అంతకుమించిన విజయం సొంతం చేసుకొంది.