‘మహర్షి’ ఫస్ట్ హాఫ్ రివ్యూ


సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘మహర్షి’ రానే వచ్చేసింది. ఉదయం ఆట ప్రారంభం అయింది. సినిమా ఫస్టాఫ్ పూర్తయింది. మహర్షి ఫస్టాఫ్ రివ్యూని పలువురు ట్విట్టర్ వేదికగా పంచుకొంటున్నారు. ఫస్టాఫ్ అదిరిపోయిందని ట్విట్ చేస్తున్నారు. తొలిభాగంలో మహేష్ కాలేజీ స్టూడెంట్ కనిపించే ఏపీసోడ్ ఉంది. దాదాపు 45నిమిషాల ఏపీసోడ్ ఇది. కాలేజీ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ పాత్రలకి సరిగ్గా సరిపోయారని ట్విట్ చేస్తున్నారు. మహేష్ ఎనర్జి, లుక్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ యూత్, క్లాస్ ఆడియొన్స్ కి విపరీతంగా నచేస్తుందని చెబుతున్నారు.

ఇక, మహేష్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కాలేజీ ఏపీసోడ్ తర్వాత మహేష్ బిజినెస్ మేన్ గా కనిపించే సన్నివేశాలు వచ్చాయి. థియేటర్స్ లో రుషి జర్నీ కొనసాగుతోంది. సెకాంఢాఫ్ లో మహేష్ రైతుగా కనిపించబోతున్నాడు. ఐతే, ఫస్టాఫ్ కు సంబంధించి కాలేజీ ఏపీసోడ్ హైలైట్ గా నిలిచింది. మహేష్ ఎనర్జి, లుక్స్, టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా వుతున్నారు. ఫన్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్ తో మహర్షి ఫస్టాఫ్ అదిరిపోయింది. మొత్తంగా మహర్షి ఫస్టాఫ్ మెగా బ్లాక్ బస్టర్ హిట్.