పవన్ పై ‘కల్కీ’ సటైర్లు

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఇన్నాళ్లకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై బదలా తీర్చుకొన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్. పవన్ అభిమానుల కడుపు నింపిన సినిమా ఇది. ప్లాపుల్లో ఉన్న పవన్ ని తిరిగి నిలబెట్టిన సినిమా. ‘గబ్బర్ సింగ్’ లో అంతాక్షరి సీన్ హైలైట్. అందులోనూ.. రాజశేఖర్ ని కమెడియన్ అనుకరించిన విధానం కడుపుబ్బ నవ్వించింది. ఐతే, ఈ సీన్ రాజశేఖర్ దంపతులకి మాత్రం మండింది. మీడియా ముఖ్యంగా తన అసహనం వ్యక్తం చేశారు.

ఈ సీన్ రాజశేఖర్ పై పవన్ వేసిన సటైర్స్ గా ప్రచారం అప్పట్లో జరిగింది. ఇప్పుడు దీనికి రాజశేఖర్ బదలా తీర్చుకొన్నారు. ఆయన తాజా చిత్రం కల్కీ. ప్రశాంత్ వర్మ దర్శకుడు. అదా శర్మ హీరోయిన్. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రాజశేఖర్ పవన్ ని అనుకరించిన సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ‘ఏం సెపితిరి ఏం సెపితిరి.. ఎప్పుడూ ఇలాగే సెపుతారా’ అంటూ పవన్ అనుకరించాడు రాజశేఖర్. అంతేకాదు.. గబ్బర్ సింగ్ లో రాజశేఖర్ ని అనుకరించిన కమెడియన్.. తన్నే ఓ సీన్ ఉంది. ఇది కచ్చితంగా పవన్ పై బదలా తీర్చుకొనే సీన్ లా ఉంది. మొత్తంగా రాజశేఖర్ కడుపుమంట ఇన్నాళ్లు తీరింది.

ఇక, కల్కీ ట్రైలర్ విషయానికొస్తే.. కథని ఏమాత్రం రివీల్ చేయకుండా.. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశారు. పురాణాలు, కర్మలని లింకు చేస్తూ కల్కీ కథని రెడీ చేసుకొన్నట్టు ట్రైలర్ తో అర్థమవుతోంది.