బిగ్ బాస్-3 హోస్ట్’గా నాగ్.. ఫిక్స్ !

తెలుగు బిగ్ బాస్ సీజన్-3 రంగం సిద్ధమవుతోంది. జులై నుంచి ప్రసారం కాబోతున్న సీజన్ 3 కోసం హోస్ట్ గా పలువురు పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, విక్టరీ వెంకటేష్, తారక్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ తదితరల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా నాగ్, వెంకీలలో ఒకరు హోస్ట్ ఎంపిక కావొచ్చనే వార్తలొచ్చాయ్.

తాజా సమాచారమ్ ప్రకారం నాగార్జున బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఒప్పందంపై నాగ్ సంతకం కూడా చేసినట్టు తెలిసింది. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్ టీఆర్ హోస్ గా వ్యవహరించారు. తనదైన ఎనర్జి, టైమింగ్ తో తెలుగు బిగ్ బాస్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. ఆ రేంజ్ తగ్గకుండా సీజన్ 2ని హ్యాండిల్ చేశారు నాచురల్ స్టార్ నాని. ఇప్పుడు సీజన్ 3 కోసం నాగ్ రంగంలోకి దిగబోతున్నాడు.