ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సమంత !

స్టార్ హీరోయిన్ సమంత స్పెయిన్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ భర్త నాగ చైతన్యతో కలిసి స్పెషన్ లో విహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టూర్ కి సంబంధించిన ఫోటోలని సామ్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా పిజ్జాలు తింటూ, పెగ్గులేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సామ్ షేర్ చేసింది.

అన్నట్టు.. సామ్ కు పిజ్జాలంటే పిచ్చి. ఇప్పుడు స్పెయిన్ టూర్ లో తెగ తినేస్తుంది. ఫిజ్జాలు తింటూ వైన్ తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. స్పెయిన్ టూర్లో సామ్ తన డైటింగ్ ఆంక్షలు కూడా పక్కన పెట్టేసిందట. ఇన్నాళ్లు సినిమాల బిజీలో ఉన్న సామ్.. దొరికిన సమయాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లి తర్వాత సామ్-చై తొలిసారి జంటగా నటించిన ‘మజిలీ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చైతూ వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ కాశీలో మొదలు కానుంది. సామ్ ప్రస్తుతం ఓ బేబీ సినిమాలో నటిస్తున్నారు.