ధర్నాకి దిగారు.. కుర్చీ కోసం తన్నుకొన్నారు !

తెలంగాణ కాంగ్రెస్ పరువు తీశారు ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వీహెచ్‌, తెలంగాణ తెదేపా అధ్యక్షడు ఎల్‌.రమణ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

ఈ వేదికపై నగేశ్‌, వీహెచ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీహెచ్‌ చేయిచేసుకోవడంతో నగేశ్‌ ఆయన చొక్కాపట్టుకున్నారు. తోపులాటలో ఇ్దదరూ కిందపడిపోయారు. వేదికపై కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్‌ కూర్చనేందుకు ప్రయత్నించడమే ఈ గొడకు దారితీసింది. చివరికి అఖిలపక్ష నేతలు సర్థి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

అసలే.. తెలంగాణలో కాంగ్రెస్ అయ్యే పరిస్థితి కరుడుగట్టిన కేసీఆర్ వ్యతిరేకులు సైతం కారెక్కుతున్నారు. మరోవైపు, తెలంగాణలో తెరాసకు తామే ప్రత్యామ్నాయం అంటూ టీ-బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు విద్యార్థుల సమస్యలపై ధర్నాకి దిగి కుర్చీ కోసం తన్నుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలా సీటు కోసం తన్నుకుంటే.. కర్మకాలి అధికారం దక్కుంటే సీఎం సీటు కోసం ఇంకా ఏమి చేసేవారో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.