నాలుగేళ్ల తర్వాత హిట్ కేక విన్నా : అల్లరి నరేష్

మహర్షి ప్రీ-రిలీజ్ వేడుకలో అల్లరి నరేష్ పెద్దగా మాట్లాడలేదు. సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడతానని చెప్పారు నరేష్. ఆదివారం హైదరాబాద్ లో ‘మహర్షి’ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నరేష్ గుండెలని పిండేశారు. ఈ సినిమా కోసం వంశీ అడిగినప్పుడు.. సినిమాలో ఏదో కామెడీ ట్రాక్ కోసం అడుగుతున్నారేమో అనుకొన్నా. కథ చెప్పాక.. ఆ పాత్రకి తననే ఎందుకు అనుకొన్నారు ? ఇంతకీ మహేష్ కి చెప్పారా.. ? అని అడిగా. మీ పేరుని మహేష్ నే చెప్పారు. మిమ్మల్ని ఓ సారి అడగమన్నారని చెప్పినట్టు ఆనందం వేసిందని చెప్పుకొచ్చారు. ఇక, ఆఖరిలో మహేష్ చెప్పిన మాటలు ఎమోషన్స్ గురిచేశాయి.

మహర్షి రిలీజ్ రోజు.. వరుసగా ఫోన్లు వచ్చాయ్. హిట్.. హిట్.. హిట్ అనే మాటలు వినిపించాయ్. ఆ ఆనందంలో ఎక్కడికైనా వెళ్లి గట్టిగా అరవాలనిపించింది. ఎందుకంటే.. ? నాలుగేళ్లు అవుతుంది హిట్ కేక వినిపించి అన్నారు. ఆ సమయంలో ఎమోషన్స్ గురైనట్టు అనిపించిన నరేష్.. తన ప్రసంగాన్ని ముగించేశాడు. నాలుగేళ్లుగా నరేష్ కి హిట్ లేదు. కామెడీ జోనర్ లో కొత్తగా ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. అలాంటి సమయంలో ఆయనకి మహర్షి సినిమా రూపంలో ఓ హిట్. అంతకుమించి పేరు వచ్చింది. ఆ ఆనందంలో సినిమా సక్సెస్ మీట్ లో చూపించారు అల్లరోడు.