బాలయ్య ‘రూలర్’.. ఈసారి ఫిక్స్ !

మాస్ టైటిల్ తో యాక్షన్ లోకి దిగడం బాలయ్యకు అలవాటే. ఐతే, బాలయ్య కొత్త సినిమా విషయం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. ఓ టైటిల్ వినిపిస్తుంటుంది. అదే ‘రూలర్’. ఇప్పుడీ టైటిల్ నిజంగా బాలయ్య వాడేస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య-కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారు కెఎస్ రవికుమార్ చేతిలో బాలయ్య సినిమా తప్ప మరోటి లేదు. దీంతో రూలర్ టైటిల్ బాలయ్యదేనని ఫిక్సయిపోవచ్చు.

ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. జగపతి బాబు విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ సినిమాలో బాలయ్య సరసన నటించిన హరిప్రియని రిపీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. రూలర్ ని ఈ యేడాదియే విడుదలకి ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో జెడ్ స్వీడుతో షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉండనుంది.