మా ఇద్దరిని వాడుకోండీ.. !


మా ఇద్దరిని కలిపి వాడుకోండీ.. అంటున్నారు కాజల్, తమన్నా. ఇండస్ట్రీలో ఛార్మి-త్రిషల బంధం గురించి తెలిసిందే. ఒకరినొకరు అమితంగా ఇష్టపడుతుంటారు. వీరిద్దరు పెళ్లి చేసుకొనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల త్రిష పుట్టినరోజు సందర్భంగా త్రిషకు ప్రపోజ్ చేసింది ఛార్మి. ఒప్పుకొంటే పెళ్లి చేసుకొంటానంది. త్రిష కూడా ఒకే చెప్పింది. ఈ సరదా సన్నివేశం అభిమానులని ఆకట్టుకొంది.

తమన్నా-కాజల్ లది కూడా ఇలాంటి బంధమే. వీరిద్దరు చాలా క్లోజ్. చాన్నాళ్ల నుంచి కలిసి నటించాలని ఆపడుతున్నారు. ఇటీవల
కలిసి క్లోజ్ గా దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన కాజల్, “మేమిద్దరం ఒకే ఫ్రేమ్ లోకి రావడానికి పెర్ ఫెక్ట్ స్క్రిప్ట్ తో పనేముంది” అంటూ టీజింగ్ గా ఓ స్టేట్ మెంట్ కూడా పెట్టింది. కాజల్ తో కలిసి ఓ సినిమా చేయాలని ఉందంటూ తమన్న ఇప్పటికే ప్రకటించింది. మరీ.. ఈ ఇద్దరు అందెగత్తెలని వాడుకొనే దర్శకుడు ఎవరో చూడాలి. కాజల్, తమన్నాలలో ఒకరు హీరో, మరొకరు హీరోయిన్’గా చేస్తే బాగుంటుందేమో.. !