మహేష్’ని ఉంచుకొంటాడట.. !
సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఎంత పొగిడినా తక్కువే. ఇది అందరు చెప్పే మాటే. నటుడు పోసాని కృష్ణమురళీ ఓ అడుగు ముందుకేసి మహేష్ ని ఉంచుకోవాలని ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్ లో మహర్షి సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పోసాని.. ‘తానే ఆడపిల్లనైతే మహేష్ ని వదిలిపెట్టేవాణ్ని కాదు. ఆయన వెంటపడేవాణ్ని. పెళ్లైన తనని ఓ చోట పెట్టండి. మిమళ్ల్ని చూస్తూ బ్రతికేస్తా’అనే వాడిని అని చెప్పుకొచ్చాడు. పోసాని మాటలకి మహేష్ తో పాటు వేదికపై ఉన్నవారంతా పగలబడి నవ్వుకొన్నారు. మహర్షి సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందన్నారు పోసాని.
మహర్షి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మహేష్ జంటగా పూజా హెగ్డే నటించారు. అల్లరి నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో విద్యా వ్యవస్థ, రైతు సమస్యలని లేవనెత్తి చూపించారు. అది ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ నటన అద్భుతం. వంశీ కథని గ్రిప్పింగ్ గా నడిపించాడు. ప్రస్తుతం మహర్షి నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేస్తూ వెళ్తోంది. ఈ జర్నీలో మరిన్ని రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి.