ప్లాపు దర్శకులతో ప్రయోగాలు అవసరమా ?


‘రాజా ది గ్రేట్’ సినిమాకు ముందు, తర్వాత కూడా మాస్ మహారాజా రవితేజ ఖాతాలో వరుసగా ప్లాపులే. అలాంటప్పుడు ఆచితూచి కథలని ఎంచుకోవాలి. ప్రతిభగల కొత్త దర్శకులని ఎంచుకోవాలి. ప్రయోగాలు చేయాలి. హిట్లు కొట్టాలి. రవితేజ మాత్రం ఇందుకు భిన్నంగా ప్లాపు దర్శకులతో, సినిమాలు చేయడానికే జంకుతున్న దర్శకుడులని ఎంచుకొని ఆశ్చర్యపరుస్తున్నారు.

వరుస ప్లాపుల్లో ఉన్న శ్రీనువైట్లని నమ్మి ‘అమర్ అక్భర్ ఆంథోని’ సినిమా చేశాడు రవితేజ. అది కాస్త ప్లాప్ అయింది. ప్రస్తుతం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ చేస్తున్నాడు. ఇది సెట్స్ మీదుండగానే కొత్త కథలని ఓకే చేస్తున్నాడు మాస్ మహారాజా. బలుపు దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పిన కథని ఒకే చేశాడు. ప్రస్తుతం మలినేని ప్లాపుల్లో ఉండటం రవితేజ అభిమానులని కలవరపెడుతోంది. ఇంతకంటే పెద్ద షాక్ ఏటంటే.. ? వివి వినాయక్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు రవితేజ.

వినాయక్-రవితేజ కలయికలో వచ్చిన ‘కృష్ణ’.. ఓ మోస్తరుగా ఆడింది. ఇటీవల వినాయక్ చెప్పిన కథని రవితేజ ఓకే చేశాడని తెలిసింది. ఈ సినిమాను టాగోర్ మధు ఒకప్పటి భాగస్వామి బుజ్జి నిర్మిస్తారని టాక్. రవితేజ తీరు చూస్తుంటే ప్లాపు దర్శకులని లైన్లో పెట్టేసి ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. అది చాలా రిస్కేమో.. !