వీహెచ్ పై దాడి : నగేష్ పై చర్యలు తప్పవట !

ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, నగేష్ తన్నుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన కాంగ్రెస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ధర్నాకు వచ్చి కుర్చీ కోసం తన్నుకొన్నారు. ఇలాంటి వారికి అధికారమిస్తే.. ఇక అంతసంగతులనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఛైర్మన్‌ కోదండ రెడ్డితోపాటు ఇతర క్రమశిక్షణ సంఘం సభ్యులు హాజరయ్యారు.

సభలో వీహెచ్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ముదిరాజ్‌ దాడి చేసినట్లు భావిస్తున్నామని క్రమశిక్షణ సంఘం వెల్లడించింది. వీహెచ్‌ పట్ల నగేశ్‌ అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. వీహెచ్‌పై జరిగిన ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. ఈ తరహా క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పింది. ప్రాథమిక సమాచారం మేరకు నగేశ్‌పై చర్యలకు తప్పకపోవచ్చు