వెంకీ హ్యాట్రిక్ కొట్టాడు


విక్టరీ వెంకటేష్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ఐతే, అది హీరోగా కాదు. గెస్ట్ గా. అవునూ.. ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది. ఏదైనా సినిమా ఫంక్షన్ కి వెంకీ గెస్ట్ గా వస్తే ఆ సినిమా హిట్. ఈ సెంటిమెంట్ విషయాన్ని ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వెంకీ గెస్ట్ గా హాజరైన మజిలీ, జెర్సీ, మహర్షి సినిమాలు మంచి విజయాన్ని అందుకొన్నాయి. అంతకుమించి మంచి సినిమాలు అనిపించుకొన్నాయి. విమర్శకుల ప్రశంసలు పొందాయ్. ఈ లెక్కన వెంకీ హ్యాట్రిక్ కొట్టినట్టే.

ఈ యేడాది ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు వెంకీ. ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకొంది. త్వరలో రెండో షెడ్యూల్ కోసం వెంకీ మామ చిత్రబృందం కాశీకి వెళ్లనుంది. ఇక, వెంకీ కోసం టాప్ దర్శకులు, యువకు దర్శకులు కథలు రాస్తున్నారు. వెంకీ దగ్గరికి సోలో కథలు, మల్టీస్టారర్ కథలు క్యూ కడుతున్నాయి. ఐతే, అందరూ కూడా వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.