మహేష్’తో పూజా తెరవెనక.. ఇలా !


‘మహర్షి’ థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొడుతున్నాడు. మహేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ ఆనందంలో చిత్రబృందం సక్సెస్ మీట్ లతో బిజీగా గడుపుతోంది. పెద్ద విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి కృతజ్ఝతలు చెబుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం ఇంకా మహర్షి సెట్ లోనే ఉంది.

ఆ తీపి జ్ఝాపకాలని నెమరు వేసుకొంటోంది. ఇందులో భాగంగా తాజాగా మహర్షి షూటింగ్ సంబంధించిన తెర వెనక సన్నివేశాల వీడియో ఒకటి తన ఇన్ స్ట్రోగ్రామ్ లో పోస్ట్ చేసింది పూజా. ఇందులో మహేష్ తో కలిసి చిందేస్తోంది. మహేష్ ని హగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.