దర్శకుడికి మహేష్ ముద్దు
దర్శకుడు వంశీ పైడిపల్లిని చూసి అమ్మాయిలు, హీరోయిన్స్ సైతం కుళ్లుకుంటున్నారు. వంశీకి దక్కిన అదృష్టం తమకు దక్కలేదన్నదని బాధపడిపోతున్నారు. మహేష్ చూపు తాకితే చాలని అమ్మాయిలు ఫీలవుతుంటారు. ఆయనతో ఒక్క షేక్ హ్యాండ్.. అబ్బో జీవితం ధన్యం అయిపోద్ది అనుకొంటారు. అలాంటిది మహేష్ ప్రేమతో ఓ ముద్దు ఇస్తే ఎలాగుంటుంది ? జీవితానికి ఇది చాలు అనిపిస్తది. వంశీ కూడా అదే అన్నారు. ఆయనకు మహేష్ ప్రేమతో ఓ ముద్దు ఇచ్చారు. ముద్దు సెల్ఫీని వంశీ షేర్ చేశాడు.
‘ఇంతకుమించి ఇంకేం అడగగలను’ అంటూ తెగ సంబరపడియాడు వంశీ. ఇప్పటికే ఈ సినిమాలోని ‘వీకెండ్ వ్యవసాయం’ అన్న కాన్సెప్ట్ నుంచి ఎందరో స్ఫూర్తిపొందుతున్నారు. పొలం పనులు చేస్తున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ‘మహర్షి’ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.
#Maharshi.. My Best moment.. Can't ask for more… 🙂@urstrulyMahesh pic.twitter.com/kNBBKkBkUA
— Vamshi Paidipally (@directorvamshi) May 12, 2019