ఆమె బాలయ్య విలన్ కాదట !
ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా తెరకెక్కాల్సి వుంది. వీరిది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బోయపాటి-బాలయ్యల హాట్రిక్ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే.. అంటే జూన్ లో బోయపాటి-బాలయ్యల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందనే వార్తలొచ్చాయ్. ఇంతలో కె.ఎస్ రవికుమార్ లైన్ లోకి వచ్చాడు.
బాలయ్యతో సినిమా ఓకే చేసుకొన్నాడు. బోయపాటి సినిమా కంటే ముందే సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ‘రూలర్’ టైటిల్ ని ఫిక్స్ చేశారట. విలన్ పాత్ర కోసం కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీని తీసుకొన్నారు. ఇక మెయిన్ విలన్ జగపతి బాబు డబుల్ యాక్షన్ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నిర్మాత సి స్పందించారు. వరలక్ష్మి విలన్ కాదు. అసలు ఆమె సినిమాలోనే నటించడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు జగపతిబాబును మాత్రమే తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ నెలలోనే రూలర్ ప్రారంభం కానుంది.