అలర్ట్ : వాట్సాప్‌ ద్వారా వైరస్‌


వాట్సాప్‌ యాప్ వైరస్‌ బారిన పడింది. వాట్సాప్‌ భద్రతా వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ స్పై వేర్‌ వచ్చింది. వాట్సాప్‌ వాయిస్‌ కాలింగ్‌ ద్వారా వచ్చే మిస్డ్‌ కాల్స్‌తో ఈ మాల్వేర్‌ ఫోన్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీని నుంచి తప్పించుకొనేందుకు
యూజర్లు తమ వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కంపెనీ వెల్లడించింది.

“వాయిస్‌ కాలింగ్స్‌కు అదనపు భద్రతా ఫీచర్లను పెడుతుండగా మా టీం ఈ లోపాన్ని గుర్తించింది. వాట్సాప్‌లోని ఈ లోపాన్ని అదనుగా చేసుకుని స్సైవేర్‌ యూజర్లపై దాడి చేసింది. యూజర్లకు గుర్తు తెలియని నంబరు నుంచి ఒకటి లేదా రెండు వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ వచ్చి ఉంటాయి. కాల్‌ చేసే సమయంలోనే మాల్వేర్‌ కోడ్‌ ఫోన్లోకి ప్రవేశించింది. అయితే ఈ స్పైవేర్‌ బారిన పడ్డ యూజర్ల సంఖ్యను మాత్రం స్పష్టంగా చెప్పలేం” అని వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.