పాక్’కు సాయం చేస్తాం.. కానీ !
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలతో భారతదేశ రాజకీయాలు హీటెక్కాయి. భారత్‌లో మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పాటయితే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మోదీ స్నేహితుడంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ… “తమ దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పాకిస్థాన్ ప్రకటించాలి. అవసరమైతే భారత్ కూడా సాయం చేస్తుంది. ఇటువంటి ప్రకటన పాక్ నుంచి వస్తే ఇమ్రాన్ ఖాన్ నిజంగానే మోదీ అభిమాని అని మేము నమ్ముతాము. అలాగే, భారత్‌తో పాక్ సత్సంబంధాలు కోరుకుంటోందని భావిస్తాము” అని అన్నారు.