టీజర్ టాక్ : ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు.
ఛార్మితో కలిసి పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

పక్కా పూరి మార్క్ టీజర్ ఇది. హైదరాబాద్ స్లాగ్ లో రామ్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయ్. రామ్ లుక్ ‘పోకిరి’లో మహేష్ బాబు లుక్ ని తలదన్నేలా ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో ‘పోకిరి’ సినిమా తరహా అదిరిపోయే ట్విట్స్ ఉండనుందని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇస్మార్ట్ శంకర్ టీజర్ మెగా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా ఇదే రేంజ్ లో ఉంటే.. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయినట్టే.