శ్రద్దగా లాఠీ పట్టింది


ఖాకీ డ్రెస్ లో ఏదో పవర్ ఉంటది. అందుకే కథానాయకులు ఖాకీ డ్రెస్ లో కనిపించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ డ్రెస్ వేస్తే పూనకం వస్తుందని సూపర్ స్టార్ మహేష్ ఓ సందర్భంలో అన్నారు. హీరోలే కాదు. హీరోయిన్స్ ఖాకీ డ్రెస్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తుంటారు. ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ తొలిసారి పోలీస్ డ్రెస్ వేసుకోబోతున్నారు.

కొత్త దర్శకుడు ఆనంద్ దర్శకత్వంలో విశాల్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్‌ కథాంశంతో రాబోతున్న చిత్రమిది. ఇందులో విశాల్ ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా శ్రద్ధ శ్రీనాథ్‌ నటిస్తోంది. ఆమె పోలీసుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ నెలాఖరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది.