హీరోగా నాని కొడుకు

నేచురల్ స్టార్ నాని కొడుకు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాని తనయుడు అర్జున్ (జున్ను-ముద్దుపేరు) అప్పుడే హీరోగా ఎంటీ అనుకొనేరూ.. ! వీడు క్రికెటర్ అర్జున్ తనయుడు హరీష్ కళ్యాణ్. ‘జెర్సీ’ సినిమా చూసిన వారందరికీ గుర్తుంటాడు నాని కథను చెప్పిన కొడుకు క్యారెక్టర్ వేసిన నటుడు హరీష్ కళ్యాణ్. ఈ యంగ్ హీరో ఇప్పటికే తమిళ్ లో కొన్ని సినిమాలు చేశాడు.

ఇప్పుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళంలో హరీష్ కళ్యాణ్ నటించిన ఇస్పాడే రాజువమ్, ఇదయ రాణివమ్ సినిమాను తెలుగులోకి హరిపిక్చర్స్ సంస్థ డబ్ చేస్తోంది. ఇది మన “ఆర్ఎక్స్100” టైపు సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ అయితే
ఆర్ఎక్స్100 హీరోయిన్ క్యారెక్టర్ ని మించిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను ‘రౌడీ బేబీ’ పేరుతో తెలుగులోకి తెస్తున్నారు. జూన్ లో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు.. హరీష్ కళ్యాణ్ స్టయిట్ తెలుగు సినిమా కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.