నితిన్ పెద్ద ఆశలే పెట్టుకొన్నాడుగా.. !!

టాలీవుడ్ స్టార్స్ కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. హీరో నితిన్ మాత్రం ఇందుకు భిన్నం. ఆయన పెద్ద ఆశలు పెట్టుకొన్నాడు. పెద్ద డైరెక్టర్స్ కావాలంటున్నాడు. ‘అ ఆ’ తర్వాత నితిన్ ఖాతాలో మరో హిట్ పడలేదు. అ ఆ హిట్ క్రిడెట్ కూడా ఎక్కువగా త్రివిక్రమ్, సమంత ఖాతాలోకే వెళ్లింది.

ఈ సినిమా తర్వాత నితిన్ చేసిన లై, ఛల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాలు ప్లాప్ అయ్యాయి. శ్రీనివాస కళ్యాణం విడుదలై 10 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు నితిన్ సినిమా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడో ఏడాది క్రితం ఓకె చేసిన ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ “భీష్మ” అలాగే వుంది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్ గా జూన్ 5 వాయిదాపడింది.

సూర్యప్రతాప్ డైరక్షన్ లో నితిన్ సినిమా క్యాన్సిల్ అయింది. దీని స్థానంలో మరో సినిమాని తీసుకొచ్చే పనిలో నితిన్ ఉన్నారు. కాస్త పెద్ద డైరక్టర్లతో సినిమా చేయాలనే ప్లాన్ లో నితిన్ ఉన్నాడు. ఎవరైనా సరే పెద్ద డైరక్టర్లను పట్టుకువస్తే, డేట్ లు ఇవ్వడమే కాదు, మాంచి ఆఫర్లు కూడా ఇస్తారని తెలుస్తోంది. రెమ్యూనిరేషన్ అక్కరలేదు. దానికి బదులు నైజాం రైట్స్ తీసుకుంటారు. గౌతమ్ మీనన్, బోయపాటి శ్రీనివాస్ ఇలా కాస్త లీజర్ గా వున్న పెద్ద డైరక్టర్ ఎవరన్నా కావాలంట. అప్పుడే సినిమా బిజినెస్ చేస్తుందని నితిన్ నమ్మకం.