సమంతకు ఎసరుపెట్టిన శ్రద్దా

ఇప్పటికే సమంతని గెలికింది శ్రద్దా శ్రీనాథ్. కన్నడలో శ్రద్ధా నటించిన ‘యూటర్న్’ సినిమాను తెలుగులో సమంత రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, తన పాత్రలో సమంతని చూడలేకపోయానని కామెంట్ చేసి షాక్ ఇచ్చింది శ్రద్దా. ఆమె కామెంట్స్ పై సమంత అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సమంత స్థానానికి శ్రద్దా ఎసరుపెట్టింది.

విశాల్-సమంత జంటగా నటించిన ‘అభిమన్యుడు’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇందులో
హీరోగా విశాల్ కొనసాగుతాడు. కానీ హీరోయిన్ గా సమంతకి బదులు శ్రద్ధా శ్రీనాథ్ ని తీసుకున్నారు. ఇప్పటికే అజిత్ తో కలిసి ‘పింక్’ రీమేక్ లో నటిస్తోన్న శ్రద్ధా ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లోనూ శ్రద్దా హవా మొదలైంది. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం జెర్సీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రద్దాకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.