ట్విట్టర్ రివ్యూ : ఏబీసీడీ


అల్లు శిరీష్‌ కథానాయకుడు నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. రుక్సార్‌ కథానాయిక. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. మలయాళ చిత్రానికి రిమేక్ గా తెరకెక్కింది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురువారం సాయంత్రం నుంచి యుఎస్ లో ‘ఏబీసీడీ’ ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. సుమారు 80 ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మార్నింగ్ ఆట మొదలైంది. సినిమా టాక్ ని ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా పంచుకొంటున్నారు. ఆ విశేషాలు ఓసారి చూద్దాం పదండీ!

మాతృకతో పోలిస్తే ‘ఏబీసీడీ’ స్థాయి తగ్గింది. చాలా మార్పులు చేశారు. కమర్షియల్ ఎలిమిమెంట్స్ ని దట్టించారు. ఐతే, అవి వర్కవుట్ కాలేదని నెటిజన్స్ ట్విట్ చేస్తున్నారు. తొలిభాగం చాలా స్లోగా సాగింది. స్టోరీ వైజ్ గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రొటీన్ స్కీన్ ప్లే. మాస్టర్ భరత్ చేసిన కొన్ని కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా ఫస్టాఫ్ యావరేజ్.

సెకాంఢాఫ్ కూడా గొప్పగా ఏమీ లేదు. బోరింగ్ సినిమా. ప్రేక్షకుడు ఎంజాయ్ చేసే ఒక్క సీన్ లేదు. కామెడీ, ఎమోషన్స్ పండలేదు. అనవసరమైన సన్నివేశాలతో కథని చెడగొట్టారు. రేటింగ్ కూడా వేస్ట్ అని ట్విట్ చేస్తున్నారు. మొత్తంగా ఏబీసీడీతో అల్లు శిరీష్ ఖాతాలో మరో ప్లాప్ చేరినట్టయింది.