‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ డేటు ఫిక్స్ !


నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. వేర్వేరు ఏజ్ గ్రూప్‌ల‌కి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్‌కు లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఓ యువ‌కుడి కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఆడ గ్యాంగ్ కు నాని లీడర్ అన్నమాట. చాలా విభిన్నంగా సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేటుని ఫిక్స్ చేశారు. ఆగస్టు 30న గ్యాంగ్ లీడర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు మైత్రీ మూవీస్ ట్విట్ చేసింది. ఆగస్టు 15న ప్రభాస్ ‘సాహో’ రాబోతోంది. ఈ సినిమా వచ్చిన 15రోజుల తర్వాత నాని గ్యాంగ్ లీడర్ రాబోతుంది. దీంతో ప్రభాస్ తో పెద్దగా ఇబ్బంది లేకుండా నాని ప్లాన్ చేసుకొన్నట్టు కనబడుతోంది.