కేన్స్ ని హీటెక్కించిన కంగనా !


బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్-2019లో రెండు లుక్కులో అదరగొట్టింది. ముందుగా చీరకట్టులో పద్దతిగా కనిపించిన కంగనా.. పార్టీ టైంలో మాత్రం దాదాపు టాప్ లెస్ గా కనిపించే లుక్ లోకి మారిపోయింది. యెద అందాలని కనువిందు చేస్తూ అల్ట్రా సెక్సీ లుక్ లో అదరగొట్టేసింది. కంగనా సెక్సీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక, సినిమాల విషయానికొస్తే.. కంగనా తాజా చిత్రం ‘మెంటల్ హై క్యా’. ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మాత. జులై 26న సినిమాప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు హృతిక్ రోషన్ `సూపర్ 30`కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల నేపథ్యంలో హృతిక్, కంగనాల మధ్య వార్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు తీవ్ర విమర్శలు చేసుకొంటున్నారు.