లక్ష్మీబాంబ్ : అక్షయ్ ఫస్ట్ లుక్

హారర్ కామెడీ ‘కాంచన’ (ముని) సిరీస్ తెలుగులో సూపర్ హిట్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కాంచన3’ మంచి విజయాన్ని అందుకొంది. టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబట్టింది. హిట్ టాక్ సినిమాలు మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలని ఓవర్ టేక్ చేసింది. ఈ ఆనందంలో బాలీవుడ్ ‘కాంచన’ సినిమాని మొదలెట్టాడు రాఘవ లారెన్స్.

బాలీవుడ్ ‘కాంచన’కు ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్-కైరా అద్వానీ జంటగా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించనున్నారు. హారర్, కామెడీ మూవీ కాబట్టి హిందీలోనూ బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. తాజాగా, ఈ సినిమాలో అక్షయ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. స్టార్ సింబల్ మధ్య అక్షయ్ కళ్లకి కాటుక పెట్టుకొంటున్న లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు. వచ్చేయేడాది జూన్ 5న సినిమాని విడుదల చేయబోతున్నట్టు పేర్కొన్నారు.