‘ఉప్పెన’ హీరోయిన్ ని చూశారా.. ?

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఎంట్రీ సినిమాకు ‘ఉప్పెన’ టైటిల్ ఫిక్సయిన సంగతి తెలిసిందే. . ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ శిష్యుడు బిచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా, ఉప్పెన హీరోయిన్ ఫిక్సయింది. కొత్త అమ్మాయి కీర్తి శెట్టిని తీసుకొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మైత్రీ మూవీస్ ట్విట్ చేసింది. ఈ నెల 25 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుందని తెలిపారు. అంతేకాదు.. వైష్ణవ్ తేజ్ కి #PanjaVaisshnavTej అనే ట్యాగ్ లైన్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. బహుశా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ ని వాడుకోవాలని పంజా వైష్ణవ్ తేజ్ అని పెట్టేసి ఉంటారు. ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోలందరు సక్సెస్ అయ్యారు. ఒక్క అల్లు శిరీష్ తప్ప. మరీ.. వైష్ణవ్ తేజ్ హీరోగా పంజా విసురుతాడేమో చూడాలి.