అందుకే మహేష్ కాలరెగిరేశాడట !

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులని రెచ్చగొడుతున్నాడు. ఆయన కాలరెగిరేయడంతో.. మిగితా హీరోల అభిమానులు రెచ్చిపోయే ప్రమాదం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహర్షిని చూసి అభిమానులే కాదు.. తాను కాలరెగిరేస్తునానని సక్సెస్ మీట్ లో మహేష్ మొదటిసారి కాలరెగిరేశాడు. ఇటీవల సుదర్శన్ థియేటర్ లో మరోసారి కాలర్ ఎత్తాడు. ఆ టైంలో మహేష్ ఇచ్చిన లుక్.. ఎవరినో టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఐతే, దాని వెనక ఎలాంటి హెచ్చరికలు, మరొటి లేదంటున్నారు మహేష్.

‘మహర్షి’ సినిమాతో మిరాకిల్ జరిగింది. నా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. రెండుసార్లు కాలర్ ఎగరేయడం ప్లాన్ ప్రకారం చేసింది కాదు. నా ఎమోషన్స్‌ని ఫ్యాన్స్‌తో పంచుకున్నానంతే. ఆరోజు చాలా మాట్లాడాలి అనుకున్నా. అవన్నీ నా హార్ట్‌లో నుండి వచ్చిన మాటలే. సుదర్శన్ థియేటర్స్ వెళ్లాక ఇక్కడ కదా నేను సినిమా చూడాల్సింది అనిపించింది. అందుకే కాలర్ ఎగరేశా’నన్నారు మహేష్.

ఇక ఫ్యాన్స్ మధ్య గొడవలు అంటారా.. ? ఇండస్ట్రీలో మహేష్, తారక్, రామ్ చరణ్, బన్నీ.. మంచి స్నేహితులు. ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలి. ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసుకొంటూ స్టార్ సన్నిహితంగా ఉన్నప్పుడు.. అభిమానులకి ఎందుకు గొడవలు. అందుకే మహేష్ కాలరెత్తెతే.. మిగితా హీరోలని తక్కువ చేసినట్టు కాదు. ఆయన హిట్ ని ఎంజాయ్ చేశారంతే.