అసలు మహర్షి పవనే.. !


సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు నిజమైన మహర్షి అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. పవన్ ఏనాడు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేయలేదు. కమర్షియల్ సినిమాలనే నమ్ముకొన్నారు. కనీసం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందైనా అలాంటి సినిమాలు చేయలేదు. మహేష్ లా గ్రామాలని దత్తత తీసుకోలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఇక, మరోవర్గం మాత్రం అసలైన మహర్షి పవనే అంటున్నారు.

ఆయన స్టార్ హీరో అయినా వ్యవసాయాన్ని నమ్ముకొన్నారు. మహేష్ చెప్పినట్టు వీకెండ్ వ్యవసాయం కాదు. పవన్ రైతుగానే బతుకుతున్నారు. అప్పుడప్పుడూ మాత్రమే సినిమాలు చేసేవారు. మిగితా సమయం అంతా ఫాం ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకొనేవారు. ఆవులని పెంచేవారు. మామిడిపండ్లు, కూరగాయలు పండించేవారు. వాటిని తెలిసిన వారికి పంచేవారు కూడా. సోషల్ మెసేజ్ ఇస్తేనే మహర్షి కాదు. నిజ జీవితంలో చేస్తే అసలైన మహర్షి. పవనే అసలైన మహర్షి అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

మరోవైపు, పవన్ మహర్షిగా ఆయన అభిమానులు చేసిన మేకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ నటించిన సినిమాల బిట్ సన్నివేశాలని చాలా తెలివిగా వాడారు. అది పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ హంగామా కామనే. పవన్, మహేష్ మంచి స్నేహితులు అన్న విషయం వారికి తెలుసు. ఏదో సరదాగా సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకొంటారంటే.. !!