అమ్మతో సమంత గొడవ ?

పెళ్లి తర్వాత సమంత కెరీర్ మరింత ఊపందుకొంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ దూసుకెళ్తోంది. ఈ యేడాది సూపర్ డిలెక్స్, మజిలీ సినిమాలతో విజయాలు అందుకొంది. వీటిలో మజిలీ విజయం సామ్ కి ప్రత్యేకం. ఆమె భర్త నాగచైతన్యకు మజిలీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ఆనందంలో సామ్-చై విహారయాత్రకు వెళ్లొచ్చారు. ఐతే, ఇలాంటి హ్యాపీ మూడులో సమంత గురించి ఓ భయంకర ప్రచారం జరుగుతోంది. ఆమె తల్లిని దూరంపెట్టిందని, ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై సామ్ స్పందించారు. “తనకు అమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తనకోసం ప్రార్ధనలు చేసేది. తనకు ఎలాంటి అవసరం ఉన్నా అమ్మే చూసుకునేది. అమ్మ నాకు రెండో దేవత. అలాంటి అమ్మకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా”నని తెలిపింది. అమ్మ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ షేర్ చేసింది.

ప్రస్తుతం సామ్ నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇది విభిన్నమైన సినిమా. ఇంకా చెప్పాలంటే ప్రయోగాత్మక సినిమాని సామ్ ఇదివరకే తెలిపింది. ఇందులో సామ్ యంగ్, యంగ్ యేజ్, ముసలి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. చాలా వినోదాత్మకంగా ఓ బేబీ ఉంటుందట. త్వరలోనే ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.