తెలంగాణ మహర్షి.. కేసీఆర్ !


రిషి సక్సెస్ స్టోరీ ‘మహర్షి’. సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ చిత్రమిది. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రంలో రైతు సమస్యలు ప్రస్తావించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమాలో ప్రస్తావించిన ‘వీకెండ్ వ్యవహసాయం’ కాన్సెప్ట్ వైరల్ అవుతోంది. రైతులని చూసి జాలిపడటం కాదు. గౌరవించాలి అనే లైన్ ఆకట్టుకొంది. అంతేకాదు.. జీవితంలో సక్సెస్ అంటే ఏంటీ ? అనేదానికి చక్కని అర్థం చెప్పారు. గతంలో ఎక్కడున్నాం.. ఇప్పుడు ఎక్కడెక్కడున్నాం ? అదే సక్సెస్ కి కొలమానంగా తెలిపారు.

ఇప్పుడీ కాన్సెప్టుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అనువదిస్తున్నారు తెరాస అభిమానులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.. తెరాస ని ఏర్పాటు చేసిన కేసీఆర్. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఉద్యమాన్ని నడిపించారు. పైనల్ గా లక్ష్యాన్ని ముద్దాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చారు. బంగారు తెలంగాణగా సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అందుకే తెరాస అభిమానులు కేసీఆర్ ని తెలంగాణ మహర్షిగా అభివర్ణిస్తున్నారు. మహర్షి సినిమాలోని ‘ఇదే కదా ఇదే కదా.. నీ కథా.. ‘ అంటూ సాగే సాంగ్ తో తెలంగాణ మహర్షి కేసీఆర్ వీడియో ఒకటి రెడీ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెరాస, కేసీఆర్ అభిమానులని తెగ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !