నానికి ఆ గ్యాప్ చాలు

నేచురల్ స్టార్ నాని మార్కెట్ పెరిగినప్పటికీ స్పీడ్ మాత్రం తగ్గించలేదు. యేడాదికి కనీసం మూడు సినిమాలు నాని నుంచి వచ్చి తీరాల్సిందే. ఈ యేడాది నాని నుంచి ‘జెర్సీ’ సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. జెర్సీ వచ్చిన నాలుగు నెలల గ్యాప్ లోనే ‘గ్యాంగ్ లీడర్’ రాబోతుంది. ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. సాధారణంగా విక్రమ్ తన సినిమాని తాపీగా చెక్కుతాడు. ఐతే, నాని దగ్గర ఆ చెక్కెడు ఏమీ కుదరదు. అందుకే రిలీజ్ డేటు ఎనౌన్స్ చేయించాడు. ఆగస్టు 30న గ్యాంగ్ లీడర్ రాబోతుంది.

ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ షూటింగ్ శంషాబాద్ లో నడుస్తోంది. వచ్చేనెల 30 నాటికి టోటల్ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్. ఈ సినిమాలో ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరక్టర్. ఇక ఈ యేడాదియే నాని నుంచి కుదిరితే మరో రెండు లేదంటే ఒక సినిమా రానుంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కథానాయకులుగా ఓ సినిమా రాబోతుంది. ఇందులో నానిది గెస్ట్ రోల్ టైపు పాత్రని తెలుస్తోంది.