యూపీయే మెరుగు.. ఎన్డీయే తరుగు !


బాజాప్తా భాజాపా మరోసారి అధికారంలోకి వస్తుందని ముందుస్తు సర్వేలు చెబుతున్నాయి. 17వ లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ఆదివారం ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల ఫలితాలను వెల్లడించాయి. ప్రధాని పీఠం మళ్లీ నరేంద్ర మోదీకేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అభిప్రాయ పడ్డాయి. భాజపా ఆధ్వర్యంలోని ఎన్‌డీయే కూటమి 300కుపైబడి సీట్లను గెలుచుకుంటుందని కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. ఎన్‌డీఏకు మెజార్టీ తగ్గినా, అతి పెద్ద కూటమిగా అవతరిస్తుందని మరికొన్ని సర్వేలు అభిప్రాయపడ్డాయి.

గత ఎన్నికల్లో భాజపాకు సొంతంగా 282 సీట్లు, ఎన్‌డీఏ కూటమికి 336 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌ 44 స్థానాలకే పరిమితమయింది. ఐతే, ఈసారి యూపీయే బలం పెరగనుంది. ఆ కూమికి 120సీట్ల వరకు రానుంది. ఎన్ డీయే బలం తగ్గినా.. మళ్లీ అధికారం చేపట్టబోతుందని సర్వేల సారాంశంగా అర్థమవుతోంది. మొత్తంగా.. ఈ ఎన్నికల్లో యూపీయే బలం పెరగనుంది. ఎన్ డీయే బలం కాస్త తగ్గనుంది. అధికారం మాత్రం ఎన్డీయేదే. ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ చూడబోతున్నామని సర్వేలు చెబుతున్నాయి.