కారు పదహారు.. పక్కా !


గత యేడాది ఆఖర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస టార్గెట్ మిస్సవ్వలేదు. వందకుపైగా అసెంబ్లీ స్థానాలని గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొంది. 88స్థానాల్లో గెలుపుపొందింది. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి చేరికలతో తెరాస బలం వంద దాటింది. అలా లక్ష్యాన్ని గులాభి పార్టీ లక్ష్యాన్ని ముద్దాడినట్టయింది. ఇక, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెరాస ‘కారు సారు పదహారు’ స్లోగన్ తో ముందుకెళ్లింది. ఎన్నికలకి ముందు తర్వాత కూడా 16 ఎంపీ సీట్లని కచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ నేతలు గట్టిగా చెప్పారు. ఇప్పుడదే నిజం కాబోతుంది. తెరాస 16 సీట్లు గెలుచుకోబోతుందని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఆదివారం సాయంత్రం తిరుపతిలో తన సర్వే ఫలితాలని వెల్లడించారు. తెలంగాణలో కారు, ఏపీలో సైకిల్ జోరు చూపించబోతున్నాయన్నారు. తెరాస 14నుంచి 16ఎంపీ స్థానాలని గెలుచుకోబోతుందన్నారు. ఎంఐఎం కు ఒక్క సీటు గ్యారెంటీ. తెలంగాణ కాంగ్రెస్ కు ఒకటి లేదా రెండు సీట్లు రావొచ్చు. లేదంటే ఆ పార్టీకి జనాలు గుండు గీసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. మొత్తానికి.. కారుకు పదహారు సీట్లు పక్కా అని ముందస్తు ఫలితాలతో తేలిపోయింది.