తెలుగు రాష్ట్రాలకు చంద్ర గ్రహణం వీడుతోంది !


ఎగ్జిట్ పోల్స్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలపై నీళ్లు చల్లాయి. కేంద్రంలో చక్రం తిప్పాలనే తాపత్రయం చంద్రులిద్దరిలో కనబడింది. ఏపీ సీఎం చంద్రబాబు తృతీయ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భాజాపా వ్యతిరేక వర్గాలన్నింటికి ఏకం చేసే పనిలో ఉన్నారు. మరోవైపు, కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాల్లో ఉన్నారు.

ఐతే, చంద్రుల్లిదరి ప్రయత్నాలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లినట్టయింది. మరోసారి భాజాపా సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తిగా స్పందించారు. “మన ఇద్దరు చంద్రుల ఫెడరల్ ఫ్రంట్.. ఫ్యామిలీ ఫ్రంట్ కు టెంటు లేదు.. ఒకాయన అడవి బాట పడితే.. ఒకాయన దిల్లీ, కలకత్తా భేటీలకు వెళ్తున్నాడు.. కొన్ని మీడియా సంస్థలూ చంద్రబాబు చక్రం తిప్పుతాడాని, కేసీఆర్ బొంగరం తిప్పుతాడాని వంత పాడారు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్ర గ్రహణం వీడుతోన్నది” అన్నారు.